Posts

Showing posts from May 7, 2021
  [1] శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి ( AJTA) శ్రీరామనవమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం [2] వారిచే లోకార్పణం చేయబడిన చిన్న పుస్తకం ఇది. హనుమంతుడు పుట్టిన స్థలం అంజనాద్రి తిరుమలలో ఉన్నది అని ఐతిహాసిక మరియు పురాణగ్రంథముల ఆధారముగా ? ముద్రించిన పుస్తకం ఇది. AJTA పత్రసంఖ్య 1. మొదటి పత్రము 1.హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు అను మొదటి వాక్యమే చాలా విలక్షణమైనది . హనుమంతుడు సర్వదేవతాస్వరూపుడైనచో ఆతను శ్రీరామస్వరూపుడు అగును కదా ? మరి హనుమంతుడు శ్రీరాముడి దాసుడిగా ప్రసిద్ధి ఎలా పొందాడు ? ఇప్పటికీ కింపురుష ఖండమునందు శ్రీరాముని భజన నామజపము ఎందుకు చేస్తున్నాడో ? ఇలా చాలా సందేహాలు. AJTA పత్రసంఖ్య 1 రెండవ పుటము ఈ విధముగా అభయాంజనేయునిగా, ఆనందాంజనేయునిగా హనుమంతుడిని వర్ణించడం జరిగింది. దీనికి తగిన కారణములు— 1.     భయగ్రస్తుడైన సుగ్రీవునికి అభయమునిచ్చి, శ్రీరామచంద్రునితో మైత్రిగావించడం వలన అభయాంజనేయునిగా ప్రసిద్ధిగాంచాడు. 2. మహాదుఃఖమునందున్న సీతామాతకు శ్రీరాముని సందేశమును అందజేసి , సీతాప్రాణదాతగా , ఆ మాతకు మహదానందమును అందజేసినకారణముగా ఈతనికి ఆన